ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 10 లక్షల మోసం

GNTR: గోరంట్లకు చెందిన ప్రభావతిని ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అరండల్ పేటకు చెందిన కల్యాణి మోసం చేసింది. కళ్యాణితో పాటు వీరభద్రం, సుధాకర్, ఆమె స్నేహితుల వద్ద నుంచి మొత్తం రూ.10 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు గుంటూరులోని అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సోమవారం సాయంత్రం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.