లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంగళవారం పాల్గొన్నారు. లబ్ధిదారులు గుంట పద్మ, చిలగంజి తులసి కుటుంబాల ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదలకు గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.