లక్ష తులసి దళాలతో విఠలేశ్వరుడికి అర్చన
NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని రుక్మిణీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ద్వాదశి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కాగడా హారతి, అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి లక్ష తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రణవానంద స్వామి హాజరై భక్తులకు ప్రవచనం అందించారు. భక్తులు స్వామీజీకి పాదపూజ చేశారు.