మంచి నీళ్ల కోసం మహిళల నిరసన

మంచి నీళ్ల కోసం మహిళల నిరసన

మేడ్చల్: జిల్లాలోని దూలపల్లి 16, 17వ వార్డుల్లో తాగునీరు సరఫరా కావడం లేదని బస్తీ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తమ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైందని, అయితే గ్రామ పంచాయతీ హయాంలో వేసిన పైప్ లైన్ కావడంతో వారానికి ఒకసారి చాలీచాలని బోరు నీటిని వదలడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.