విద్యార్థులకు మద్రాస్ ఐఐటీ విద్య
KNR: జిల్లా విద్యార్థులకు మద్రాస్ ఐఐటీ అందించే స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులను చెబుతున్నారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు అధునాతన సాంకేతిక కోర్సులపై ఇప్పటి నుంచే అవగాహన పెంచుకుంటున్నారు. ముఖ్యంగా డేటా సైన్స్-ఏఐ, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ వంటి అంశాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ కోర్సులు విద్యార్థులలో డిజిటల్ నైపుణ్యాలు, ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించడానికి తోడ్పడుతున్నాయి.