రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

WGL: నెక్కొండ మండలం అప్పలరావుపేట శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తిపాక తండా కెనాల్ నుంచి రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పత్తిపాక తండాకు చెందిన తేజావత్ పార్వతి, బోడ చరణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.