రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
VZM: బొండపల్లి మండలంలోని గొట్లాం చెక్ పోస్ట్ వద్ద ఇవాళ బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.