మొర్రిగూడ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై DEO తనిఖీ
ASR: డుంబ్రిగూడ మండలం మొర్రిగూడ మండల పరిషత్ అప్‌పర్ ప్రైమరీ పాఠశాలలో ఉపాద్యాయుల కొరతపై వచ్చిన పిర్యాదు నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మజీరావు సోమవారం పాఠశాలను సందర్శించారు. పాడేరు మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్‌కు గసబ మాజీ సర్పంచ్ పాంగి సురేష్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.