కెమికల్ ఇంజినీరింగ్ పరిశోధనలపై ఎక్స్టర్నల్ రివ్యూ

కెమికల్ ఇంజినీరింగ్ పరిశోధనలపై ఎక్స్టర్నల్ రివ్యూ

WGL: వరంగల్ నిట్‌లోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎక్స్టర్నల్ అకడమిక్ అండ్ రీసెర్చ్ రివ్యూ విజయవంతంగా ముగిసింది. బుధవారం ప్రొఫెసర్ అజయ్ కె. దలై, ప్రొ. గిరిధర్ మద్రాస్, ప్రొ. శిర్షేందు దే తదితర ప్రపంచ స్థాయి నిపుణులు పాల్గొని, ఫ్యాకల్టీ, ఎం.టెక్, పీహెచ్‌డి స్కాలర్లతో ముఖాముఖి చర్చలు జరిపారు. అకడమిక్ రంగంలో కొత్త శిఖరాలను చేరడానికి సూచనలు ఇచ్చారు.