'గ్రామాలలో ఉన్న సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం'
కోనసీమ: గ్రామాలలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా వాడ వాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పీ. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.