రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

చిత్తూరు నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు.. గుడిపాల (M) రామాపురానికి చెందిన వాసుదేవ నాయుడు గంగాసాగరం వద్ద బైకుపై వస్తూ మలుపు తిరుగుతుండగా.. వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.