కొత్త కార్మిక కోడ్లు రద్దు చేయాలని నిరసన

కొత్త కార్మిక కోడ్లు రద్దు చేయాలని నిరసన

MNCL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కార్మిక కోడ్లను రద్దు చేయాలని మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని గనులపై కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చట్టాల గెజిట్ పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొత్త చట్టాలను రద్దు చేసి.. 29 కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.