35 ఏళ్ల సమస్యకు పరిష్కారం..!

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో 35 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది. మంగళవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో గత 35 ఏళ్లుగా ఇళ్ల స్థలాలు పొందినా పొజిషన్ సర్టిఫికెట్లు లేక ఇబ్బంది పడుతున్న 35 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో పొజిషన్, నిర్బంధ సర్టిఫికెట్లు అందజేశారు. సర్టిఫికెట్లు పొందిన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.