చార్‌ధామ్ యాత్ర @ 51 లక్షలకుపైగా భక్తులు
చార్‌ధామ్ యాత్రలో ఈ ఏడాది 51 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. అత్యధికంగా 17.68 లక్షల మంది కేదార్‌నాథ్‌ను సందర్శించినట్లు పర్యాటకశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బద్రీనాథ్ (16.60 లక్షలు), గంగోత్రి (7.58 లక్షలు), యమునోత్రి (6.44 లక్షలు) మిగతా స్థానాల్లో నిలిచాయి. నిన్న బద్రీనాథ్ ఆలయ ద్వారాల మూసివేతతో ఈ ఏడాది యాత్రకు ముగింపు పలికారు.