మృతదేహం కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు

మృతదేహం కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు

SKLM: ఉపాధి కోసం పోలాండ్ దేశానికి వెళ్లిన పలాస మండలం ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర్(33) మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ఈనెల 21వ తేదీన మరణించినట్లు సమాచారం వచ్చింది. ఇప్పటికి ఐదు రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు. కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. తక్షణమే అధికారులు, నాయకులు కలుగజేసుకుని మృతదేహాం చేరేలా చూడాలన్నారు.