నూతన SC కమ్యూనిటీ హాల్‌ను సందర్శించిన MLC

నూతన SC కమ్యూనిటీ హాల్‌ను సందర్శించిన MLC

ASF: పెంచికల్ పేట్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన SC కమ్యూనిటీ హాల్ ను MLC దండే విఠల్ గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ కమిటీ సభ్యులు, MLC విఠల్‌ను శాలువాతో సన్మానించారు. మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సముద్రాల రాజన్న, సర్పంచ్ భక్తు రామచందర్, తదితరులు పాల్గొన్నారు.