'త్రాగునీరు సమస్యలు లేకుండా చూడాలి'
SKLM: పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కృషి చేస్తున్నారు. వేసవిలో నెలకొన్న త్రాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.