రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

VZM: విజయనగరం రైల్వే స్టేషన్‌లోని 5వ నంబర్ ప్లాట్‌ఫారంపై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP SI బాలాజీ రావు తెలిపారు. ఈ మేరకు మృతుడి వయస్స సుమారు 50 నుండి 55 సంవత్సరాలు మద్య ఉంటాయన్నారు. సిమెంట్ రంగు షర్టు, ముదురు నీలిరంగు ప్యాంటు ధరించినట్లు వివరించారు. మృతుడిని గుర్తిస్తే తమను సంప్రదించాలని కోరారు.