ఈ నెల 10న లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ఈ నెల 10న లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని చిన్న గొల్లపల్లి గ్రామంలో ఉన్నన లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవాలు మే 10 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. 10 వ తేదీన అంకురారోహణ, కళ్యాణ ఉత్సవం, 11న హనుమంత సేవ, 12న పొంగళ్లు, గరుడ సేవ, 13న మోహిని మరియు గజోత్సవం, 14న కంపకల్లి,15న ఏకాంత సేవ జరుగుతుందని భక్తులు రావాలని కోరారు.