కన్నుల పండగ భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం
BDK: భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం వేడుకను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అమ్మవారికి కంకణ దారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపించారు.