క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల కఠిన హెచ్చరిక
KRNL: ఆదోని వన్ టౌన్ పీఎస్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు చేసి, బ్యాంకు ఖాతాలు నిలిపివేస్తామని తెలిపారు. బెట్టింగ్‌కు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.