ఒకే వేదికపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు

ప్రకాశం: జిల్లాలో ఒకే వేదికపై ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు పక్క పక్కనే కూర్చొని అందరినీ ఆశ్చర్య పరిచారు. పెద్దారవీడు మండలంలో ఓ వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి ఒకే చోట కూర్చొని సరదాగా ముచ్చటించారు. దీంతో వారిని ఇలా చూసి అక్కడి జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.