ఆటో బోల్తా.. ఒకరు మృతి

NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు వద్ద రోడ్డుపైన అటో బోల్తా పడి వ్యక్తి మరణించిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల వివరాలు గ్రామానికి చెందిన బొప్పని మారయ్య NKP నుండి BVL వెళ్ళే ఆటోలో ఎక్కాడు. ఉదయ సముద్రం దగ్గర ఆ అటో పల్టీ పడింది. మారయ్య అక్కడికక్కడే మరణించాడు. పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.