పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు.. భోజన నాణ్యతపై ఆగ్రహం
WGL: గీసుగొండ మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆరేపల్లి అంగన్ వాడీ కేంద్రం ఫ్రెండ్లీ చైల్డ్ పాఠశాలగా ఎంపిక కావడంతో ప్రారంభ తనిఖీ జరిగింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు కనిపించడం, కొంతమంది విద్యార్థులకు భోజనం అందకపోవడం గుర్తించిన కలెక్టర్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.