'దశాబ్దాల కాలం నాటి విద్యుత్ లైన్ల సమస్య పరిష్కారం'

KMM: నేలకొండపల్లి మండలం మోటాపురంలో దశాబ్దాల కాలం నాటి విద్యుత్ లైన్ల సమస్య మంత్రి పొంగులేటి చొరవతో పరిష్కారం అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లినేని వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మంత్రి పొంగులేటి ఆదేశాలతో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను విద్యుత్ శాఖ అధికారులు మరొక చోటకు మార్చారు. మంత్రి పొంగులేటికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.