'జాతీయ క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం'
NDL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అత్యున్నత క్రీడా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు కోరారు. 2025 సంవత్సరానికి గానూ మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలకు అర్హులైన క్రీడాకారులు 28 తేదీలోపు www.dbtyas-sports.gov.in అప్లై చేసుకోవాలన్నారు.