'మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

'మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

ASF: మిషన్ భగీరథ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో మార్చి 30 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ హెచ్చరించారు. సోమవారం ఆసిఫాబాద్‌లో మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాల విషయమై కోరుతూ.. కలెక్టర్ హరిత, మిషన్ భగీరథ EEకి వినతిపత్రం అందజేశామన్నారు. మార్చి 29 లోపు వేతనాలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.