VIDEO: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు
నిర్మల్ జిల్లా ముధోల్, నిర్మల్ రూరల్ మండలం, భైంసా పరిధిలోని పలు గ్రామాలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న, నువ్వులు, మామిడితో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నేలరాలిందని, ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.