నాటు తుపాకులపై ప్రత్యేక తనిఖీలు: ఎస్పీ

నాటు తుపాకులపై ప్రత్యేక తనిఖీలు: ఎస్పీ

VZM: జిల్లాలో నాటు తుపాకులు, పేలుడు పదార్థాల నియంత్రణకు గుర్తించిన గ్రామాల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్లు నిర్వహించాలని ఎస్పీ దామోదర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. లైసెన్సు లేకుండా తుపాకులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరి వద్దనైనా నాటు తుపాకులు లభ్యమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.