కేటీఆర్ వ్యాఖ్యలు ఎవరూ నమ్మరు: సీతక్క

కేటీఆర్ వ్యాఖ్యలు ఎవరూ నమ్మరు: సీతక్క

TG: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి గొంతు కోసింది బీఆర్‌ఎస్సే అని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని.. ఈ అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కులగణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందన్నారు.