కుషాయిగూడ డిపో నుంచి 160 బస్సులు బంద్
MDCL: కుషాయిగూడ డిపోలో బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 160 బస్సులు డిపోకే పరిమితమై రోడ్డెక్కకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులకు వెళ్లాల్సినవారు ప్రత్యామ్నాయ రవాణా కోసం తంటాలు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో, ఆర్టీసీ కార్మికులందరూ డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు.