ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ASF: తిర్యాణి సర్కార్ దవాఖానలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలోని మహిళా డాక్టర్లతో పాటు మహిళా సిబ్బంది వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మని పేర్చారు. అనంతరం బతుకమ్మకు సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ఆస్పత్రి ఆవరణంలో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో డాక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.