వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్

TPT: ఏపీ కేడర్-2023 బ్యాచ్‌కు చెందిన IFS అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. తిరుపతి జిల్లా వెంకటగిరి సబ్ DFOగా కొల్లూరు వెంకట శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ CS కె.విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ 2023లో విడుదలైన IFS ఫలితాల్లో ఆల్ ఇండియాలో టాప్ 1 ర్యాంక్ సాధించారు.