టీడీపీలో చేరిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు

టీడీపీలో చేరిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు

తిరుపతి: జిల్లా కోట మండల పరిషత్ మాజీ అధ్యక్షులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి బుధవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి చేరారు. ముందుగా మంత్రి కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.