దుకాణాల్లో పోలీసుల తనిఖీలు

దుకాణాల్లో పోలీసుల తనిఖీలు

KMM: ముదిగొండ సీఐ మురళీ ఆదేశాల మేరకు ఎస్సైలు హరిత, కృష్ణాప్రసాద్‌లు గురువారం మండలంలోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల సమీపంలో గల దుకాణాల్లో మత్తుపదార్థాలును విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాల, పాఠశాల దగ్గరలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వ్యాపారులకు తెలిపారు.