VIDEO: ధర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీడ్కోలు
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం హెచ్ఎం మురళీధర్ మాట్లాడుతూ.. పాఠశాల జీవితం భవిష్యత్తుకు పునాది. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ, సంస్కారాన్ని అలవాటు చేసుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.