'ప్రతి ఆడబిడ్డ ఈ వ్యాక్సిన్ ను వినియోగించుకోవాలి'
BDK: ఇల్లందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం HPV వ్యాక్సిన్ టీకా కార్యక్రమాన్ని వైద్యులు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడబిడ్డలందరికీ ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తుందని, ఈ వ్యాక్సిన్‌ను ప్రతి ఆడబిడ్డ వినియోగించుకోవాలని ఆయన వెల్లడించారు.