రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: కావలి పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శనివారం 10వ శ్రీ శ్రీ గౌర-నితాయ్ రథయాత్ర, కావలిలో ఘనంగా ప్రారంభమైంది. రథయాత్రలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జెండా ఊపి రథయాత్ర ప్రారంభించారు. కావలి ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.