ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
KNR: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ చౌక్‌లోని జ్యోతిబా ఫూలే అడ్డాకు చెందిన గాండ్ల శ్రీకాంత్ అనే ఆటో డ్రైవర్, కిరాయిలు లేక కుటుంబం గడవక ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.