పునర్విక ప్రాణాల కోసం పొన్నూరు ప్రజల చేయూత

పునర్విక ప్రాణాల కోసం పొన్నూరు ప్రజల చేయూత

GNTR: కర్నూలుకు చెందిన 11 నెలల చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. చిన్నారికి రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని తెలిసి పొన్నూరు యువకులు ముందుకు వచ్చారు. మంగళవారం పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తూ చిన్నారి ప్రాణాలు కాపాడాలని సంకల్పించారు. ఎవరికి తోచినంత వారు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.