రూ.70 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

రూ.70 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

ATP: అనంతపురం నగరంలోని వడ్డే కాలనీ, హమాలీ కాలనీలలో శనివారం రూ. 70 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.