VIDEO: అన్నమయ్య జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థినుల ఎంపిక
అన్నమయ్య జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థినులు రాజ్యాంగ దినోత్సవ జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి రవి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జరిగిన జిల్లా స్థాయి పోటీలలో రాయచోటి జూనియర్ కళాశాల విద్యార్థిని మిస్పా, బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని అఫ్సా, గుర్రంకొండ జూనియర్ కళాశాల విద్యార్థిని హారిక అర్హత సాధించారు.