సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలి: కలెక్టర్

సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలి: కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టర్ ఏ. సిరి కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను మంగళవారం సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువు ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.