హనుమాన్ మాలలో ముస్లిం యువకుడు

హనుమాన్ మాలలో ముస్లిం యువకుడు

JGL: మతసామరస్యానికి నిలువెత్తుగా కొడిమ్యాలకు చెందిన యూసఫ్ అనే ముస్లిం యువకుడు నిలిచాడు. పూడూర్‌కి చెందిన యూసఫ్ హనుమాన్ మాల ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది యూసఫ్ ఓ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డరన్నాడు. ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానంటే రాముని కృప, హనుమంతుడి ఆశీస్సులేనని విశ్వసించాడు. ఆ భక్తితోనే ఈ ఏడాది హనుమాన్ మాల ధరించానన్నాడు.