చోరీ ఘటనపై కేసు నమోదు

మేడ్చల్: ఇంట్లో చోరీ జరిగిన ఘటన దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. అంజనాద్రినగర్ కాలనీకి చెందిన దాసరి మహిపాల్‌రెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి నాలుగు తులాల బంగారాలు, రూ.6 వేల నగదును దోచుకెళ్లారు. తీర్థయాత్రల నుంచి బుధవారంఇంటికి చేరుకున్న మహిపాల్ కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.