'పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం'

HYD: సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్పల్లిలోని తన కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు. పారిశుధ్యం నిర్వహణలో కార్మికుల పాత్ర కీలకమని, పరిశుభ్ర వాతావరణం ప్రజల ఆరోగ్యానికి అవసరమని అన్నారు. కార్మికులు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా సహకరించాలని కోరారు.