స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం
ATP: అనంతపురం రాంనగర్ లోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వివిధ సమస్యల మీద అర్జీలను స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.