'రైతులు పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవాలి'

NZB: వ్యవసాయ కుటుంబంతో ముడిపడిన సమావేశం రైతు మహోత్సవమని బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు మహోత్సవం సభలో పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని కోరారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. అధిక దిగుబడి పొందవలసిన అవసరం ఉందన్నారు.