VIDEO: షార్ట్ సర్క్యూట్.. గుడిసె దగ్ధం
KMR: బిర్కూర్ మండలం అన్నారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు మచ్కూరి కిష్టయ్యకు చెందిన పూరి గుడిసె శనివారం రాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది.