బారువా బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

SKLM: సోంపేట మండలంలోని బారువా బీచ్ ఫెస్టివల్స్ ఏర్పాట్లు పక్కాగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బారువా బీచ్ ఫెస్టివల్స్‌పై జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్‌తో కలిసి శుక్రవారం ఆయన జిల్లా అధికారులుతో ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.